بِسْم اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ ١

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ 1 పేరుతో. 2


الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٢

సర్వలోకాలకు ప్రభువైన 3 అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. 4


الرَّحْمَـٰنِ الرَّحِيمِ ٣

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. 5


مَالِكِ يَوْمِ الدِّينِ ٤

తీర్పు దినానికి 6 స్వామి.7


إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ٥

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. 8


اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ٦

మాకు ఋజుమార్గం9 వైపునకు మార్గదర్శ కత్వం చేయి.

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ٧

నీవు అనుగ్రహించినవారి10 మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి 11 గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గ భ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.