'గాఫిరున్‌: క్షమించేవాడు, క్షమాగుణ పరిపూర్ణుడు. దీని ఇతరపేర్లు సూరహ్‌ అల్‌-ము'మిన్‌, విశ్వాసి మరియు సూరహ్‌ అ'త్‌-'తౌల్‌ అనికూడాఉన్నాయి. జి'-'త్తౌలు, అంటే ధనసంపత్తులు ప్రసాదించేవాడు, లేక తన దాసులను అనుగ్రహించేవాడు.ఈ సూరహ్‌తో 'హా-మీమ్‌, అక్షరాలతో మొదలయ్యే 7 సూరాహ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ చివరి మక్కహ్ కాలపు సూరాహ్‌లు. వీటిలో విశ్వాస-అవిశ్వాసం మరియు దివ్యజ్ఞాన అవతరణ మరియు సత్య-తిరస్కారుల తిరస్కారం, మంచి-చెడులు మరియు సత్యా-సత్యాల మధ్య భేదాలు వివరించబడ్డాయి. 85 ఆయాతు లున్న ఈ సూరహ్ పేరు 3వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. అ'త్‌-'తౌల్‌ పదం కూడా 3వ ఆయత్‌లోనే ఉంది. అల్‌-ము'మిన్‌ పదం 28వ ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 40:1

حم ١

* 'హా-మీమ్‌.


  • 40:2

تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّـهِ الْعَزِيزِ الْعَلِيمِ ٢

ఈ గ్రంథ అవతరణ (ఖుర్‌ఆన్‌ అవతరణ) సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ తరఫునుండి జరిగింది.


  • 40:3

غَافِرِ الذَّنبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ ٣

పాపాలను క్షమించేవాడు 1 మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, 2 ఎంతో ఉదార స్వభావుడు. 3 ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. (అందరీ) మరలింపు ఆయన వైపునకే ఉంది!


  • 40:4

مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّـهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ ٤

సత్య-తిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరిత మైన నడక నిన్ను మోసగింప నివ్వరాదు!


  • 40:5

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِن بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ ٥

వారికి పూర్వం గడిచిన నూ'హ్‌ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాలవారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిర స్కరించారు. మరియు ప్రతి సమాజంవారు తమ సందేశహరుణ్ణి నిర్బంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించ టానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో!


  • 40:6

وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ ٦

మరియు ఈ విధంగా సత్య-తిరస్కారానికి పాల్పడిన వారిని గురించి: "నిశ్చయంగా, వారు నరకవాసులు." అని, అన్న నీ ప్రభువు వాక్కు సత్యమయ్యింది.


  • 40:7

الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ ٧

సింహాసనాన్ని ('అర్ష్‌ను) మోసేవారు మరియు దాని చుట్టు ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. 4 మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించినవారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: "ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతిదానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించేవారిని క్షమించు; మరియు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!


  • 40:8

رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ٨

"ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింప జేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసు లలో (అ'జ్వాజ్‌లలో) మరియు వారి సంతానం లో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు. 5


  • 40:9

وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ٩

"మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించి నట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)." 6


  • 40:10

إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّـهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ ١٠

నిశ్చయంగా, (ఆ రోజు) సత్య-తిరస్కారులను పిలిచి వారితో: "ఈ రోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్‌కు మీ పట్ల ఇంతకంటే ఎక్కువ అసహ్యం కలిగేది!" అని అనబడుతుంది.


  • 40:11

قَالُوا رَبَّنَا أَمَتَّنَا اثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِّن سَبِيلٍ ١١

వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్నిఇచ్చావు మరియు రెండుసార్లు జీవితాన్ని ఇచ్చావు. 7 ఇప్పడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయటపడే మార్గం ఏదైనా ఉందా?"


  • 40:12

ذَٰلِكُم بِأَنَّهُ إِذَا دُعِيَ اللَّـهُ وَحْدَهُ كَفَرْتُمْ ۖ وَإِن يُشْرَكْ بِهِ تُؤْمِنُوا ۚ فَالْحُكْمُ لِلَّـهِ الْعَلِيِّ الْكَبِيرِ ١٢

(వారికి ఇలా సమాధానం ఇవ్వబడు తుంది): "దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్‌ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగ స్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వ సించారు! ఇప్పుడుతీర్పు మహోన్నతుడు, మహ నీయుడు 8 అయిన అల్లాహ్‌ చేతిలో ఉంది. 9


  • 40:13

هُوَ الَّذِي يُرِيكُمْ آيَاتِهِ وَيُنَزِّلُ لَكُم مِّنَ السَّمَاءِ رِزْقًا ۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ ١٣

ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు.


  • 40:14

فَادْعُوا اللَّـهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ ١٤

కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించు కొని, అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించండి సత్య-తిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా!


  • 40:15

رَفِيعُ الدَّرَجَاتِ ذُو الْعَرْشِ يُلْقِي الرُّوحَ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ لِيُنذِرَ يَوْمَ التَّلَاقِ ١٥

ఆయన మహోన్నతమైన స్థానాలు గల వాడు, 10 (సర్వాధికార) సింహాసనానికి ('అర్ష్‌కు) అధిపతి; 11 తన దాసులలో తనకు ఇష్టమైన వారి పై, తన ఆజ్ఞప్రకారం, దివ్యజ్ఞానాన్ని (రూ'హ్‌ను) అవతరింపజేస్తాడు, 12 ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.


  • 40:16

يَوْمَ هُم بَارِزُونَ ۖ لَا يَخْفَىٰ عَلَى اللَّـهِ مِنْهُمْ شَيْءٌ ۚ لِّمَنِ الْمُلْكُ الْيَوْمَ ۖ لِلَّـهِ الْوَاحِدِ الْقَهَّارِ ١٦

ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ 13 అయిన అల్లాహ్‌దే!


  • 40:17

الْيَوْمَ تُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ لَا ظُلْمَ الْيَوْمَ ۚ إِنَّ اللَّـهَ سَرِيعُ الْحِسَابِ ١٧

ఆ రోజు ప్రతిప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.


  • 40:18

وَأَنذِرْهُمْ يَوْمَ الْآزِفَةِ إِذِ الْقُلُوبُ لَدَى الْحَنَاجِرِ كَاظِمِينَ ۚ مَا لِلظَّالِمِينَ مِنْ حَمِيمٍ وَلَا شَفِيعٍ يُطَاعُ ١٨

మరియు (ఓ ము'హమ్మద్‌!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతులవరకు వచ్చి అడ్డు కొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆరోజు) దుర్మా ర్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసే వాడు గానీ, 14 ఎవ్వడూ ఉండడు.


  • 40:19

يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورُ ١٩

ఆయన (అల్లాహ్‌)కు చూపులలోని నమ్మక ద్రోహం మరియు హృదయాలలో దాగి వున్న రహస్యాలు అన్నీ తెలుసు.


  • 40:20

وَاللَّـهُ يَقْضِي بِالْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَقْضُونَ بِشَيْءٍ ۗ إِنَّ اللَّـهَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ ٢٠

మరియు అల్లాహ్‌, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్‌ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పుచేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్‌! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. (3/8)


  • 40:21

أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ كَانُوا مِن قَبْلِهِمْ ۚ كَانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللَّـهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُم مِّنَ اللَّـهِ مِن وَاقٍ ٢١

* ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరికంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరికంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్‌ వారి పాపాలకుగానూ వారిని పట్టు కున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్‌ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేకపోయాడు.


  • 40:22

ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللَّـهُ ۚ إِنَّهُ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ ٢٢

ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్‌ వారిని శిక్షకు గురిచేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు.


  • 40:23

وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ ٢٣

మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్‌లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము;


  • 40:24

إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ ٢٤

ఫిర్‌'ఔన్‌, హామాన్‌ మరియు ఖారూన్‌ల 15 వద్దకు! కాని వారు: "ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు.


  • 40:25

فَلَمَّا جَاءَهُم بِالْحَقِّ مِنْ عِندِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ٢٥

తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొనిరాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." 16 కాని సత్య-తిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.


  • 40:26

وَقَالَ فِرْعَوْنُ ذَرُونِي أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُ ۖ إِنِّي أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسَادَ ٢٦

మరియు ఫిర్‌'ఔన్‌ ఇలా అన్నాడు: "మూసాను చంపేపని నాకువదలిపెట్టండి; అతనిని తన ప్రభువును పిలుచుకోనివ్వండి. వాస్తవానికి, నాభయమేమిటంటే, అతను మీధర్మాన్ని మార్చ వచ్చు, లేదా దేశంలో కల్లోలాన్ని రేకెత్తించవచ్చు!"


  • 40:27

وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ ٢٧

మరియు మూసా అన్నాడు: "నిశ్చయంగా నేను లెక్కతీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్‌) శరణు వేడుకుంటున్నాను!" 17


  • 40:28

وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ اللَّـهُ وَقَدْ جَاءَكُم بِالْبَيِّنَاتِ مِن رَّبِّكُمْ ۖ وَإِن يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّـهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ٢٨

అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్‌'ఔన్‌ కుటుంబపు ఒకవ్యక్తి ఇలా అన్నాడు: 18 "ఏమీ? మీరు, 'అల్లాహ్‌యే నా ప్రభువు.' అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొనివచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడు తుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్‌ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!


  • 40:29

يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَن يَنصُرُنَا مِن بَأْسِ اللَّـهِ إِن جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ ٢٩

"ఓ నాజాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్‌ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్‌'ఔన్‌ అన్నాడు: "నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే!" 19


  • 40:30

وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ الْأَحْزَابِ ٣٠

మరియు విశ్వసించిన ఆ వ్యక్తి అన్నాడు: "నా జాతి ప్రజలారా! నిశ్చయంగా పూర్వం అనేక సంఘాలకు దాపురించిన దినమే మీకూ దాపురించునేమోనని నేను భయపడుతున్నాను!


  • 40:31

مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۚ وَمَا اللَّـهُ يُرِيدُ ظُلْمًا لِّلْعِبَادِ ٣١

"నూ'హ్‌, 'ఆద్‌, స'మూద్‌ మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారికి వచ్చినటువంటి (దుర్దినం). మరియు అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేయగోరడు.


  • 40:32

وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ ٣٢

"మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం 20 గురించి భయపడుతున్నాను."


  • 40:33

يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُم مِّنَ اللَّـهِ مِنْ عَاصِمٍ ۗ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٣٣

ఆ రోజు మీరు వెనుదిరిగి పారిపోవాలను కుంటారు, కాని అల్లాహ్‌ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించే వాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.


  • 40:34

وَلَقَدْ جَاءَكُمْ يُوسُفُ مِن قَبْلُ بِالْبَيِّنَاتِ فَمَا زِلْتُمْ فِي شَكٍّ مِّمَّا جَاءَكُم بِهِ ۖ حَتَّىٰ إِذَا هَلَكَ قُلْتُمْ لَن يَبْعَثَ اللَّـهُ مِن بَعْدِهِ رَسُولًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ ٣٤

మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్‌ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొనివచ్చాడు. కాని మీరు అతడు తెచ్చినవాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరు అన్నారు: "ఇక అల్లాహ్‌ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" 21 ఈ విధంగా అల్లాహ్‌ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.


  • 40:35

الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۖ كَبُرَ مَقْتًا عِندَ اللَّـهِ وَعِندَ الَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّـهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ ٣٥

ఎవరైతే అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్‌ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్‌ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతివ్యక్తి హృదయం మీద ముద్రవేస్తాడు.


  • 40:36

وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَّعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ ٣٦

మరియు ఫిర్‌'ఔన్‌ ఇలా అన్నాడు: "ఓ హామాన్‌! నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు, బహుశా (దానిపైకి ఎక్కి) నేను మార్గాలను పొందవచ్చు;


  • 40:37

أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَـٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ ٣٧

"ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా నేను అతనిని అసత్య వాదిగా భావిస్తున్నాను!" మరియు ఈ విధంగా ఫిర్‌'ఔన్‌కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిర్‌'ఔన్‌ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది.


  • 40:38

وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ ٣٨

మరియు విశ్వసించిన ఆవ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: "నాజాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, నేను మీకు సరైనమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను.


  • 40:39

يَا قَوْمِ إِنَّمَا هَـٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ ٣٩

"నా జాతి ప్రజలారా! నిశ్చయంగా ఈ ఇహ లోక జీవితసుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చ యంగా పరలోకమే శాశ్వతమైన నివాసస్థలము.


  • 40:40

مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَـٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ ٤٠

"దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. 22 అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. 23 (1/2)


  • 40:41

وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ ٤١

* "మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను. మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు.


  • 40:42

تَدْعُونَنِي لِأَكْفُرَ بِاللَّـهِ وَأُشْرِكَ بِهِ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ وَأَنَا أَدْعُوكُمْ إِلَى الْعَزِيزِ الْغَفَّارِ ٤٢

"మీరు నన్ను – అల్లాహ్‌ను తిరస్కరించి – ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానంలేదో! వారిని, ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు. మరియు నేనేమో మిమ్మల్ని సర్వ శక్తిమంతుని, క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను.


  • 40:43

لَا جَرَمَ أَنَّمَا تَدْعُونَنِي إِلَيْهِ لَيْسَ لَهُ دَعْوَةٌ فِي الدُّنْيَا وَلَا فِي الْآخِرَةِ وَأَنَّ مَرَدَّنَا إِلَى اللَّـهِ وَأَنَّ الْمُسْرِفِينَ هُمْ أَصْحَابُ النَّارِ ٤٣

"నిస్సందేహంగా! వాస్తవానికి, మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. 24 మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్‌ వైపునకే మరియు నిశ్చయంగా, మితిమీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు.


  • 40:44

فَسَتَذْكُرُونَ مَا أَقُولُ لَكُمْ ۚ وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ بَصِيرٌ بِالْعِبَادِ ٤٤

"కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు."


  • 40:45

فَوَقَاهُ اللَّـهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ ٤٥

ఆ తరువాత అల్లాహ్‌ అతనిని, వారు పన్నిన చెడుకుట్రల నుండి కాపాడాడు. మరియు ఫిర్‌'ఔన్‌ జనులను దుర్భరమైన శిక్ష చుట్టు కున్నది.


  • 40:46

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ ٤٦

ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింప బడుతూ ఉంటారు. 25 మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్‌'ఔన్‌ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" 26 అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.


  • 40:47

وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا نَصِيبًا مِّنَ النَّارِ ٤٧

ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదు లాడుతున్నప్పుడు (ఇహలోకంలో) బలహీను లుగా పరిగణింపబడిన వారు, పెద్దమనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: "వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుస రిస్తూ ఉండేవారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా?"


  • 40:48

قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّـهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ ٤٨

దురహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: "వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్‌ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పుచేశాడు!"


  • 40:49

وَقَالَ الَّذِينَ فِي النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ ٤٩

మరియు నరకాగ్నిలో పడివున్న వారు, నరకపు రక్షకులతో: "మా శిక్షను కనీసం ఒక్కరోజు కొరకైనా తగ్గించమని, మీరు మీ ప్రభువును ప్రార్థించండి!" అని అంటారు.


  • 40:50

قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُم بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ٥٠

వారు (రక్షకులు) అంటారు: "ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవ ప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: "అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వ బడుతుంది: "అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్య-తిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది.


  • 40:51

إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ يَقُومُ الْأَشْهَادُ ٥١

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించినవారికి ఇహలోకజీవితంలో మరియు సాక్షులు నిలబడేరోజున కూడా సహాయము నొసంగుతాము. 27


  • 40:52

يَوْمَ لَا يَنفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ ٥٢

ఆ రోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. 28 మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది.


  • 40:53

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ ٥٣

మరియు వాస్తవంగా, మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రా'యీల్‌ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్‌కు) వారసులుగా చేశాము; 29


  • 40:54

هُدًى وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ ٥٤

బుధ్ధిమంతులకు మార్గ దర్శకత్వంగా మరియు హితోపదేశంగా!


  • 40:55

فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ ٥٥

కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యం; నీ పాపాలకు క్షమాపణ వేడుకో మరియు సాయంత్రం మరియు ఉదయం నీ ప్రభువు పవిత్రతను కొనియాడు ఆయనను స్తుతించు.


  • 40:56

إِنَّ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۙ إِن فِي صُدُورِهِمْ إِلَّا كِبْرٌ مَّا هُم بِبَالِغِيهِ ۚ فَاسْتَعِذْ بِاللَّـهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ ٥٦

నిశ్చయంగా, ఎవరైతే, తమదగ్గర ఎలాంటి ప్రమాణంలేనిదే అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండిఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్‌ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.


  • 40:57

لَخَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٥٧

వాస్తవానికి ఆకాశాలను మరియు భూమిని సృష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.


  • 40:58

وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَلَا الْمُسِيءُ ۚ قَلِيلًا مَّا تَتَذَكَّرُونَ ٥٨

మరియు గ్రుడ్డివాడు మరియు చూడగల వాడు, సమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజా లరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ!


  • 40:59

إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ ٥٩

నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలామంది ప్రజలు విశ్వసించరు.


  • 40:60

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ ٦٠

మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. 30 నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."


  • 40:61

اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ اللَّـهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ ٦١

అల్లాహ్‌! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించిన వాడు. 31 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు.


  • 40:62

ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ٦٢

ఆయనే అల్లాహ్‌, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించిన వాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు! అయితే మీరెందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? 32


  • 40:63

كَذَٰلِكَ يُؤْفَكُ الَّذِينَ كَانُوا بِآيَاتِ اللَّـهِ يَجْحَدُونَ ٦٣

ఇదేవిధంగా అల్లాహ్‌ సూచనలను (ఆయాత్‌ లను) తిరస్కరించే వారందరూ మోసగింపబడుతూ ఉంటారు.


  • 40:64

اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ قَرَارًا وَالسَّمَاءَ بِنَاءً وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ ذَٰلِكُمُ اللَّـهُ رَبُّكُمْ ۖ فَتَبَارَكَ اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٦٤

అల్లాహ్‌యే! మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియ మించినవాడు మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చి దిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్‌! మీ పోషకుడు. కావున అల్లాహ్‌ ఎంతో శుభదాయ కుడు, సర్వలోకాలకు ప్రభువు.


  • 40:65

هُوَ الْحَيُّ لَا إِلَـٰهَ إِلَّا هُوَ فَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۗ الْحَمْدُ لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ ٦٥

ఆయన సజీవుడు. 33 ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని(భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వ స్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్‌ మాత్రమే. (5/8)


  • 40:66

قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّـهِ لَمَّا جَاءَنِيَ الْبَيِّنَاتُ مِن رَّبِّي وَأُمِرْتُ أَنْ أُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ ٦٦

* ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువు తరఫు నుండి, నాకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతనే, అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించేవాటి ఆరాధన నుండి నేను వారించ బ్డడాను మరియు నేను సర్వలోకాల ప్రభువుకు మాత్రమే విధేయుడను (ముస్లింను) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను."


  • 40:67

هُوَ الَّذِي خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُّسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ ٦٧

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. 34 తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్త- ముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్త వయస్సులో బలంగలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థంచేసు కుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).


  • 40:68

هُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ٦٨

జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింప జేసేవాడు ఆయనే! ఆయన ఏదైనా చేయాలను కున్నప్పుడు, కేవలం దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే అది అయిపోతుంది.


  • 40:69

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّـهِ أَنَّىٰ يُصْرَفُونَ ٦٩

ఏమీ? నీకు తెలియదా? అల్లాహ్‌ సూచన లను (ఆయాత్‌లను) గురించి వాదులాడేవారు ఏ విధంగా (సత్యంనుండి) తప్పించబడుతున్నారో?


  • 40:70

الَّذِينَ كَذَّبُوا بِالْكِتَابِ وَبِمَا أَرْسَلْنَا بِهِ رُسُلَنَا ۖ فَسَوْفَ يَعْلَمُونَ ٧٠

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్క రించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు;


  • 40:71

إِذِ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَالسَّلَاسِلُ يُسْحَبُونَ ٧١

ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు 35 (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడ తాయో మరియు వారు ఈడ్చబడతారో!


  • 40:72

فِي الْحَمِيمِ ثُمَّ فِي النَّارِ يُسْجَرُونَ ٧٢

సలసల కాగే నీళ్లలోకి, తరువాత నరకాగ్ని లోకి, కాల్చబడటానికి.


  • 40:73

ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تُشْرِكُونَ ٧٣

అప్పుడు వారితో అనబడుతుంది: "మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు?


  • 40:74

مِن دُونِ اللَّـهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا بَل لَّمْ نَكُن نَّدْعُو مِن قَبْلُ شَيْئًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ الْكَافِرِينَ ٧٤

"(ఎవరినైతే) మీరు అల్లాహ్‌ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలాకాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." 36 ఈ విధంగా అల్లాహ్‌ సత్య-తిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.


  • 40:75

ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ ٧٥

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించి నందుకూ!


  • 40:76

ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ ٧٦

"(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాసస్థలం ఎంత దుర్భరమైనది!"


  • 40:77

فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّـهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ ٧٧

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్‌ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు! 37


  • 40:78

وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ فَإِذَا جَاءَ أَمْرُ اللَّـهِ قُضِيَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُونَ ٧٨

మరియు (ఓ ము'హమ్మద్‌!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుప లేదు. మరియు అల్లాహ్‌ అనుమతి లేనిదే, ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియ (ఆయాత్‌) లను స్వయంగా చేయలేడు. 28 కాని అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడు తుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.


  • 40:79

اللَّـهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ ٧٩

అల్లాహ్‌ మీ కొరకు పశువులను సృష్టించాడు, వాటి మీద మీరు సవారీ చేయటానికి మరియు వాటిలో కొన్నింటిని మీరు తినుటకూను! 39


  • 40:80

وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ ٨٠

మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరినచోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకుపోబడతారు.


  • 40:81

وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّـهِ تُنكِرُونَ ٨١

మరియు (ఈవిధంగా) ఆయన మీకు తన సూచనలను (ఆయాత్‌ లను) చూపుతున్నాడు. అయితే అల్లాహ్‌ యొక్క ఏ ఏ సూచనలను (ఆయాత్‌లను) మీరు నిరాకరిస్తారు?


  • 40:82

أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ ٨٢

ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరికంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరికంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలిపోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికిరాలేదు.


  • 40:83

فَلَمَّا جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرِحُوا بِمَا عِندَهُم مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٨٣

ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చి నప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వ పడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసా లాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది.


  • 40:84

فَلَمَّا رَأَوْا بَأْسَنَا قَالُوا آمَنَّا بِاللَّـهِ وَحْدَهُ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِ مُشْرِكِينَ ٨٤

ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: "మేము అద్వితీయుడైన అల్లాహ్‌ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్‌కు) సాటి-కల్పిస్తూ వచ్చిన భాగస్వాము లను తిరస్క రిస్తున్నాము."


  • 40:85

فَلَمْ يَكُ يَنفَعُهُمْ إِيمَانُهُمْ لَمَّا رَأَوْا بَأْسَنَا ۖ سُنَّتَ اللَّـهِ الَّتِي قَدْ خَلَتْ فِي عِبَادِهِ ۖ وَخَسِرَ هُنَالِكَ الْكَافِرُونَ ٨٥

కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్‌ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం. మరియు అక్కడ సత్య-తిరస్కారులు నష్టానికి గురిఅవుతారు.