అత్‌-త'హ్రీము: నిషేధించటం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహం (57-66)లో ఇది చివరిది. ఇది దాదాపు 7వ హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయబడింది.

దైవప్రవక్త ('స'అస) తమ భార్యలలో ఒకామె 'జైనబ్‌ బింతె జ'హష్‌ (ర. 'అన్హా) ఇంటికి పోయి నప్పుడు, అక్కడ తేనె త్రాగేవారు మరియు అక్కడ కొంత ఎక్కువ కాలం ఆగేవారు. ఈ విషయం 'ఆయి'షహ్‌ మరియు 'హ'ఫ్స (ర.'అన్హా)లకు, సహించరానిదయ్యింది. ఈ విషయాన్ని వారు మాన్పించదలచి, ఒక రోజు దైవప్రవక్త ('స'అస), 'జైనబ్‌ బింతె జ'హష్‌ (ర.'అన్హా), ఇంటి నుండి వారిలో ఒకామె ఇంటికి రాగానే ఆమె: 'ఓ దైవప్రవక్త ('స'అస) మీ నోటి నుండి మ'గాఫీర్‌ (దుర్వాసనగల ఒక పువ్వు) వాసన వస్తుందేమిటీ?' అని అన్నది. దానికి దైవప్రవక్త ('స'అస): 'నేను తేనె మాత్రమే త్రాగాను! అల్లాహ్‌ (సు.త.) సాక్షిగా ఇక ముందు నేను తేనె త్రాగను.' అని దానిని తమపై నిషేధించుకున్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతులు అవతరింపజేయబడ్డాయి, ('స. బు'ఖారీ). 12 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 66:1

يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّـهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ١

* ఓ ప్రవక్తా! అల్లాహ్‌ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించు కుంటున్నావు? 1 నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


  • 66:2

قَدْ فَرَضَ اللَّـهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّـهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ ٢

వాస్తవానికి అల్లాహ్‌ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. 2 మరియు అల్లాహ్‌యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.


  • 66:3

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّـهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَـٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ ٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు 3 రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు 4 చెప్పింది మరియు అల్లాహ్‌ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయటపడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు." 5


  • 66:4

إِن تَتُوبَا إِلَى اللَّـهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّـهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ ٤

(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒక వేళ మీరిద్దరూ అల్లాహ్‌ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే), వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగి పోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్‌ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్‌ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి).


  • 66:5

عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا ٥

"ఒకవేళ అతను (ము'హమ్మద్‌) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్‌, మీకు బదులుగా, మీ కంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించ గలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తి పరులు, పశ్చాత్తాపపడేవారు, (అల్లాహ్‌ను) ఆరా ధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) 6 వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!" 7


  • 66:6

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّـهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ٦

ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! 8 దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్‌ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.


  • 66:7

يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ ٧

ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.


  • 66:8

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّـهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّـهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٨

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ వైపునకు మనఃపూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! 9 మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్‌ తనప్రవక్తను మరియు అతనితోపాటు విశ్వసించిన వారిని అవమానంపాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడివైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. 10 వారు ఇలా ప్రార్థిస్తారు: "ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్థుడవు!"


  • 66:9

يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ ٩

ఓ ప్రవక్తా! నీవు సత్య-తిరస్కారులతో మరియు కపట-విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి. మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతిచెడ్డ గమ్యస్థానం. 11


  • 66:10

ضَرَبَ اللَّـهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّـهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ ١٠

సత్య-తిరస్కారుల విషయంలో అల్లాహ్‌ నూ'హ్‌ భార్య మరియు లూ'త్‌ భార్యల ఉదాహరణలను ఇచ్చాడు. 12 ఆ ఇద్దరు స్త్రీలు మా సత్పురుషులైన మా ఇద్దరు దాసుల (వివాహ) బంధంలో ఉండిరి. కాని ఆ ఇద్దరు స్త్రీలు వారిద్దరిని మోసగించారు. కావున వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీల విషయంలో అల్లాహ్‌ ముందు (పరలోకంలో) ఏ విధంగాను సహాయపడలేరు. 13 మరియు (తీర్పు దినమున) వారితో: "నరకాగ్నిలో ప్రవేశించేవారితో సహా మీరిద్దరు స్త్రీలు కూడా ప్రవేశించండి!" అని చెప్పబడుతుంది.


  • 66:11

وَضَرَبَ اللَّـهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ ١١

మరియు అల్లాహ్‌, విశ్వసించినవారిలో ఫిర్‌'ఔన్‌ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు. 14 ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకంచేసుకోండి): "ఓ నా ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్నినిర్మించు! మరియు నన్ను, ఫిర్‌'ఔన్‌ మరియు అతని చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతి వారి నుండి కాపాడు."


  • 66:12

وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ ١٢

మరియు 'ఇమ్రాన్‌ కుమార్తె మర్యమ్‌ను 15 (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడుకున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరపు నుండి) జీవం (ఆత్మ) ఊదాము. 16 మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది. 17