అన్‌-నాజి'ఆత్‌: Those Who Pull Out, బలవంతంగా లాగు, ఈడ్చు లేక కఠినంగా తీయు వారు. ఇది సూరహ్‌ అన్‌-నబా' (78) తరువాత అవతరింపజేయబడిన చివరి మక్కహ్ కాలపు సూరహ్‌. 46 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 79:1

وَالنَّازِعَاتِ غَرْقًا ١

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసేవారి (దేవదూతల) సాక్షిగా! 1


  • 79:2

وَالنَّاشِطَاتِ نَشْطًا ٢

(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవ దూతల) సాక్షిగా! 2


  • 79:3

وَالسَّابِحَاتِ سَبْحًا ٣

(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా! 3


  • 79:4

فَالسَّابِقَاتِ سَبْقًا ٤

మరియు పందెంలో వలే (ఒకరితోనొకరు) పోటీపడే వారి సాక్షిగా!


  • 79:5

فَالْمُدَبِّرَاتِ أَمْرًا ٥

మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!


  • 79:6

يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ٦

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది. 4


  • 79:7

تَتْبَعُهَا الرَّادِفَةُ ٧

దాని తర్వాత రెండవసారి 5 బాకా ఊద బడుతుంది (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).


  • 79:8

قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ ٨

ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడ లాడుతూ ఉంటాయి.


  • 79:9

أَبْصَارُهَا خَاشِعَةٌ ٩

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.


  • 79:10

يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ ١٠

వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వస్థితిలోకి మళ్ళీ తీసుకురాబడతామా?


  • 79:11

أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ١١

"మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"


  • 79:12

قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ ١٢

వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"


  • 79:13

فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ ١٣

కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.


  • 79:14

فَإِذَا هُم بِالسَّاهِرَةِ ١٤

అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.


  • 79:15

هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ ١٥

ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా? 6


  • 79:16

إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى ١٦

అతని ప్రభువు పవిత్ర 'తువా లోయలో అతనిని పిలిచి నప్పుడు, 7


  • 79:17

اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ ١٧

(ఇలా అన్నాడు): "ఫిర్‌'ఔన్‌ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.


  • 79:18

فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّ ١٨

"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?


  • 79:19

وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ ١٩

'మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతికలిగి ఉంటావా?' "


  • 79:20

فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ ٢٠

తరువాత అతను (మూసా) అతనికి (ఫిర్‌'ఔన్‌కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.


  • 79:21

فَكَذَّبَ وَعَصَىٰ ٢١

కాని అతడు (ఫిర్‌'ఔన్‌) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.


  • 79:22

ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ ٢٢

ఆ తర్వాత అతడు (ఫిర్‌'ఔన్‌) వెనక్కి మరలిపోయి (కుట్రలు) పన్నసాగాడు.


  • 79:23

فَحَشَرَ فَنَادَىٰ ٢٣

పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;


  • 79:24

فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ ٢٤

ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును!" 8


  • 79:25

فَأَخَذَهُ اللَّـهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَ ٢٥

కావున అల్లాహ్‌ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురిచేశాడు. 9


  • 79:26

إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَ ٢٦

నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్‌కు) భయపడే ప్రతివ్యక్తి కొరకు గుణపాఠ ముంది.


  • 79:27

أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا ٢٧

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠిన మయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది! 10


  • 79:28

رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا ٢٨

ఆయన దాని కప్పును (ఎత్తును) చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;


  • 79:29

وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا ٢٩

మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.


  • 79:30

وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا ٣٠

మరియు ఆపిదప భూమిని పరచినట్లు చేశాడు. 11


  • 79:31

أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا ٣١

దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;


  • 79:32

وَالْجِبَالَ أَرْسَاهَا ٣٢

మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;


  • 79:33

مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ ٣٣

మీకూ మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా! 12


  • 79:34

فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ ٣٤

ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థానదినం) వచ్చినప్పుడు;


  • 79:35

يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ ٣٥

ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;


  • 79:36

وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ ٣٦

మరియు చూసేవారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. 13


  • 79:37

فَأَمَّا مَن طَغَ ٣٧

ఇక ధిక్కారంతో హద్దులుమీరి ప్రవర్తించిన వాడికి;


  • 79:38

وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا ٣٨

మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చినవాడికి;


  • 79:39

فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ ٣٩

నిశ్చయంగా, నరకాగ్నియే వాని నివాసస్థాన మవుతుంది!


  • 79:40

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ ٤٠

నిశ్చయంగా, నరకాగ్నియే వాని నివాసస్థాన మవుతుంది!


  • 79:41

فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ ٤١

నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాసస్థాన మవుతుంది!


  • 79:42

يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ٤٢

(ఓ ము'హమ్మద్‌!) వీరు నిన్ను – ఆ ఘడియను గురించి – "అసలు అది ఎప్పడొస్తుంది?" అని అడుగు తున్నారు.


  • 79:43

فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا ٤٣

దాని గురించి చెప్పడానికి, దాంతో నీకేమి సంబంధం?


  • 79:44

إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا ٤٤

దాని వాస్తవజ్ఞానం నీ ప్రభువుకే ఉంది!


  • 79:45

إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا ٤٥

(ఓ ము'హమ్మద్‌!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించేవాడవు మాత్రమే!


  • 79:46

كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا ٤٦

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు. 12 (1/8)