అన్‌- నబఅ': The Great News, The Tiding, వార్త, సమాచారం. ఇది చివరి మక్కహ్ కాలపు సూరహ్‌. ఇది పునరుత్థానం మరియు అంతిమ తీర్పులను గురించి తెలుపుతోంది. 40 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు రెండవ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 78:1

عَمَّ يَتَسَاءَلُونَ ١

[(*)] ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు? 1


  • 78:2

عَنِ النَّبَإِ الْعَظِيمِ ٢

ఆ మహా వార్తను గురించేనా?


  • 78:3

الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ ٣

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగిఉన్నారో!


  • 78:4

كَلَّا سَيَعْلَمُونَ ٤

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.


  • 78:5

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ٥

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసు కోగలరు.


  • 78:6

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا ٦

ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?


  • 78:7

وَالْجِبَالَ أَوْتَادًا ٧

మరియు పర్వతాలను మేకులుగా? 2


  • 78:8

وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا ٨

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము. 3


  • 78:9

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ٩

మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.


  • 78:10

وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا ١٠

మరియు రాత్రిని ఆచ్ఛాదంగా చేశాము.


  • 78:11

وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ١١

మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.


  • 78:12

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ١٢

మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.


  • 78:13

وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ١٣

మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.


  • 78:14

وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ١٤

మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. 4


  • 78:15

لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا ١٥

దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!


  • 78:16

وَجَنَّاتٍ أَلْفَافًا ١٦

మరియు దట్టమైన తోటలను.


  • 78:17

إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا ١٧

నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం. 5


  • 78:18

يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا ١٨

ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.


  • 78:19

وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ١٩

మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;


  • 78:20

وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ٢٠

మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. 6


  • 78:21

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ٢١

నిశ్చయంగా, నరకం ఒక మాటు;


  • 78:22

لِّلطَّاغِينَ مَآبًا ٢٢

ధిక్కారుల గమ్యస్థానం;


  • 78:23

لَّابِثِينَ فِيهَا أَحْقَابًا ٢٣

అందులో వారు యుగాల తరబడి ఉంటారు. 7


  • 78:24

لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا ٢٤

అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.


  • 78:25

إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ٢٥

సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప! 8


  • 78:26

جَزَاءً وِفَاقًا ٢٦

(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!


  • 78:27

إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا ٢٧

వాస్తవానికి వారు లెక్కతీసుకోబడుతుందని ఆశించలేదు.


  • 78:28

وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا ٢٨

పైగా వారు మా సూచన (ఆయాత్‌)లను అసత్యాలని తిరస్కరించారు.


  • 78:29

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا ٢٩

మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము. 9


  • 78:30

فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ٣٠

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము 10


  • 78:31

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ٣١

నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;


  • 78:32

حَدَائِقَ وَأَعْنَابًا ٣٢

ఉద్యాన వనాలూ, ద్రాక్ష తోటలూ!


  • 78:33

وَكَوَاعِبَ أَتْرَابًا ٣٣

మరియు ఈడూ-జోడూ గల (యవ్వన) సుందర కన్యలు;


  • 78:34

وَكَأْسًا دِهَاقًا ٣٤

మరియు నిండిపొర్లే (మధు) పాత్ర.


  • 78:35

لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا ٣٥

అందులో (స్వర్గంలో) వారు ఏలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.


  • 78:36

جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا ٣٦

(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.


  • 78:37

رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَـٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا ٣٧

భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.


  • 78:38

يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَـٰنُ وَقَالَ صَوَابًا ٣٨

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్‌) 11 మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించినవాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడ లేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు. 12


  • 78:39

ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا ٣٩

అదే అంతిమ సత్య దినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! 13


  • 78:40

إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابً ٤٠

నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. 14 మరియు సత్య-తిరస్కారి: "అయ్యో, నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" 15 అని వాపోతాడు.