అల్‌-ముజా(ది)దలహ్‌: వాదించటం. ఈ 10 మదీనహ్ సూరాహ్‌ల సమూహంలో ఇది 2వది. ఇస్లాంకు ముందు 'అరబ్బులలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని గురించి మరియు దానిని నిషేధించడం గురించి ఇందులో వివరించబడింది. ఇది దాదాపు 4-5 హిజ్రీలో అవతరింపజేయ- బడింది. ఇది బహుశా సూరహ్‌ అల్‌-అహ్‌జాబ్‌ (33) కంటే ముందు అవతరింపజేయబడింది. 22 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 58:1

قَدْ سَمِعَ اللَّـهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّـهِ وَاللَّـهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ بَصِيرٌ ١

[(*)] వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్‌తో మోరపెట్టు కుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్‌ విన్నాడు. 1 అల్లాహ్‌ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు.


  • 58:2

الَّذِينَ يُظَاهِرُونَ مِنكُم مِّن نِّسَائِهِم مَّا هُنَّ أُمَّهَاتِهِمْ ۖ إِنْ أُمَّهَاتُهُمْ إِلَّا اللَّائِي وَلَدْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَيَقُولُونَ مُنكَرًا مِّنَ الْقَوْلِ وَزُورًا ۚ وَإِنَّ اللَّـهَ لَعَفُوٌّ غَفُورٌ ٢

మీలో ఎవరైతే తమ భార్యలను "జిహార్‌ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి తల్లులు కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. 2 మరియు నిశ్చయంగా, వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాశీలుడు.


  • 58:3

وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٣

మరియు ఎవరైతే తమ భార్యలను "జిహార్‌ ద్వారా దూరంచేసి, తరువాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే! వారిద్దరు ఒకరి నొకరు తాకక ముందు, ఒక బానిసను విడుదల చేయించాలి. ఈ విధంగా మీకు ఉపదేశమివ్వ బడుతోంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ ఎరుగును.


  • 58:4

فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِن قَبْلِ أَن يَتَمَاسَّا ۖ فَمَن لَّمْ يَسْتَطِعْ فَإِطْعَامُ سِتِّينَ مِسْكِينًا ۚ ذَٰلِكَ لِتُؤْمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ ۚ وَتِلْكَ حُدُودُ اللَّـهِ ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ ٤

కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను తాకకముందు, రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేనివాడు, అరవైమంది నిరుపేదలకు భోజనంపెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు ఇవి అల్లాహ్‌ నిర్ణయించిన హద్దులు. మరియు సత్య-తిరస్కా రులకు బాధాకర మైన శిక్ష పడుతుంది.


  • 58:5

إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّـهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ ٥

నిశ్చయంగా, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించిన వారు అవమానింపబడినట్లు అవమా నింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన సూచనలను (ఆయాత్‌లను) అవత రింపజేశాము. మరియు సత్య-తిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది.


  • 58:6

يَوْمَ يَبْعَثُهُمُ اللَّـهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ أَحْصَاهُ اللَّـهُ وَنَسُوهُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٦

అల్లాహ్‌ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపేరోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్‌ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్‌యే ప్రతిదానికి సాక్షి.


  • 58:7

أَلَمْ تَرَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِن نَّجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِن ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّـهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٧

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్‌కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూవున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదు గురు రహస్యసమాలోచనలు చేస్తూవున్నా ఆయన ఆరవవాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువమంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. 4 వారు ఎక్కడ వున్నాసరే! తరువాత ఆయన పునరుత్థానదినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగాతెలుసు.


  • 58:8

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّـهُ وَيَقُولُونَ فِي أَنفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّـهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ ٨

ఏమీ? నీకు తెలియదా (చూడటంలేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగి నప్పటికీ! వారు – వారికి నిషేధింపబడిన దానినే – మళ్ళీ చేస్తున్నారని? 5 మరియు వారు రహస్యంగా – పాపం చేయడం, హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి – సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ము'హమ్మద్‌!) నీవద్దకు వచ్చి నపుడు, అల్లాహ్‌ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాంచేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: 6 "మేము పలికే మాటలకు అల్లాహ్‌ మమ్మల్ని ఎందుకు శిక్షించటంలేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం!


  • 58:9

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّـهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ ٩

ఓ విశ్వాసులారా! మీరు రహస్యసమాలో- చనలు చేస్తే – పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘిం చటం గురించి కాకుండా – పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశపరచబడతారు.


  • 58:10

إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٠

నిశ్చయంగా, రహస్య సమాలోచన షై'తాన్‌ చేష్టయే. 7 అది విశ్వాసులకు దుఃఖం కలిగించ- టానికే! కాని అల్లాహ్‌ అనుమతిలేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. 8 మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి.


  • 58:11

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّـهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا يَرْفَعِ اللَّـهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١١

ఓ విశ్వాసులారా సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటుకల్పిస్తే, అల్లాహ్‌ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. 9 మరియు ఒకవేళ మీతో (నమా'జ్‌ లేక జిహాద్‌కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించ- బడిన వారికి అల్లాహ్‌ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. 10 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.


  • 58:12

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَاجَيْتُمُ الرَّسُولَ فَقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَةً ۚ ذَٰلِكَ خَيْرٌ لَّكُمْ وَأَطْهَرُ ۚ فَإِن لَّمْ تَجِدُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٢

ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలాశ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానంచేయటానికి) మీ వద్ద ఏమీలేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత అని తెలుసుకోండి.


  • 58:13

أَأَشْفَقْتُمْ أَن تُقَدِّمُوا بَيْنَ يَدَيْ نَجْوَاكُمْ صَدَقَاتٍ ۚ فَإِذْ لَمْ تَفْعَلُوا وَتَابَ اللَّـهُ عَلَيْكُمْ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ ۚ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٣

ఏమీ? మీరు (ప్రవక్తతో) మీ ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయపడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్‌ మిమ్మల్ని మన్నించాడు, కావున మీరు నమా'జ్‌ను స్థాపించండి మరియు విధిదానం ('జకాత్‌) ఇవ్వండి. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును. (1/8)


  • 58:14

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّـهُ عَلَيْهِم مَّا هُم مِّنكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ ١٤

* ఏమీ? అల్లాహ్‌ ఆగ్రహానికి గురిఅయిన జాతివారి వైపుకు మరలినవారిని నీవు చూడలేదా? వారు మీతో చేరినవారు కారు మరియు వారితోను చేరినవారు కారు. వారు బుధ్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు.


  • 58:15

أَعَدَّ اللَّـهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ ١٥

అల్లాహ్‌ వారి కొరకు కఠిన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. నిశ్చయంగా, వారు చేసే పనులన్నీ చాలా చెడ్డవి.


  • 58:16

اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ فَلَهُمْ عَذَابٌ مُّهِينٌ ١٦

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది.


  • 58:17

لَّن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّـهِ شَيْئًا ۚ أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ١٧

అల్లాహ్‌ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ, వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.


  • 58:18

يَوْمَ يَبْعَثُهُمُ اللَّـهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ ١٨

అల్లాహ్‌ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్‌) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు!


  • 58:19

اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنسَاهُمْ ذِكْرَ اللَّـهِ ۚ أُولَـٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ ١٩

షై'తాన్‌ వారిపై ప్రాబల్యం పొందినందువలన వారిని అల్లాహ్‌ ధ్యానం నుండి మరపింపజేశాడు. అలాంటివారు షై'తాన్‌ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! షై'తాన్‌ పక్షానికి చెందినవారు, వారే! నిశ్చయంగా నష్టపోయేవారు.


  • 58:20

إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّـهَ وَرَسُولَهُ أُولَـٰئِكَ فِي الْأَذَلِّينَ ٢٠

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో! అలాంటి వారే, పరమ నీచులలో చేరినవారు.


  • 58:21

كَتَبَ اللَّـهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّـهَ قَوِيٌّ عَزِيزٌ ٢١

"నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము." అని అల్లాహ్‌ వ్రాసిపెట్టాడు 11 నిశ్చయంగా, అల్లాహ్‌ మహా బలశాలి, సర్వ శక్తిమంతుడు!


  • 58:22

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّـهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَـٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَـٰئِكَ حِزْبُ اللَّـهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّـهِ هُمُ الْمُفْلِحُونَ ٢٢

అల్లాహ్‌ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్‌ మరియు ఆయన సందేశ- హరుణ్ణి వ్యతిరేకించే వారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! 12 ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుంటుంబంవారైనా సరే! 13 అలాంటివారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూ'హ్‌) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్‌ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్‌ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్‌ పక్షం వారే సాఫల్యం పొందేవారు.