అల్‌-మా'ఊన్‌: ఉపకారం, సహాయం, తోడ్పాటు, Assistance, ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. దీని ఇతర పేర్లు; అద్‌-దీన్‌, అరా'య్‌త లేక అల్‌-యతీమ్‌ (ఫ'త్హ్ అల్‌-ఖదీర్‌). బహుశా ఇది సూరహ్ అత్‌-తకాసు'ర్‌ (102) తరువాత అవతరింపజేయబడింది. 7 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 7వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 107:1

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ ١

తీర్పు దినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1


  • 107:2

فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ ٢

అతడే అనాథులను కసరికొట్టేవాడు; 2


  • 107:3

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ٣

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.


  • 107:4

فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ٤

కావున, నమా'జ్‌ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు! 3


  • 107:5

الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ٥

ఎవరైతే తమ నమా'జ్‌ల పట్ల అశ్రధ్ధ వహిస్తారో! 4


  • 107:6

الَّذِينَ هُمْ يُرَاءُونَ ٦

ఎవరైతే ప్రదర్శనా బుధ్ధితో వ్యవహరిస్తారో (నమా'జ్‌ సలుపుతారో)! 5


  • 107:7

وَيَمْنَعُونَ الْمَاعُونَ ٧

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో! 6