అల్‌-కాఫిరూన్‌: Deniers of the Truth, సత్యతిరస్కారులు. The Disbelievers. ఇది సూరహ్‌ అల్‌-మా'ఊన్‌ (107) తరువాత, మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయ బడింది. సత్య-ధర్మం విషయంలో సమాధానపడటం / రాజీపడటం విశ్వాసులకు తగనిపని. ధర్మం విషయంలో కొంతవరకు రాజీపడమని, మక్కహ్ ముష్రికులు దైవప్రవక్త ('స'అస)తో అన్నప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది. 'స'హీ'హ్‌ 'హదీస్‌' ల ప్రకారం క'అబహ్ 'తవాఫ్‌ తరువాత చేసే రెండు రక'ఆత్‌లలో, ఫజ్ర్‌ మరియు మ'గ్‌రిబ్‌ సున్నత్‌లలో దైవప్రవక్త ('స'అస) ఈ సూరహ్‌ (109) మరియు సూరహ్‌ అల్‌-ఇ'ఖ్‌లా'స్‌ (112) పఠించేవారు. అంతేకాదు అతను ('స'అస) తమ అనుచరులకు: "మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరహ్‌ చదివితే షిర్క్‌నుండి దూరమవుతారు." అని కూడా ప్రబోధించారు. (ముస్నద్‌ అ'హ్‌మద్‌, 5/456, తిర్మీజీ', 3403, అబూ-దావూద్‌, 5055 మొదలైనవి). 6 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 109:1

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ١

ఇలా అను: "ఓ సత్య-తిరస్కారులారా!


  • 109:2

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ٢

"మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;


  • 109:3

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ٣

"మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.


  • 109:4

وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ٤

"మరియు మీరు ఆరాధిస్తున్నవాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;


  • 109:5

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ٥

"మరియు మీరు ఆరాధిస్తున్నవాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;


  • 109:6

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ٦

"మీధర్మం మీకూ మరియు నాధర్మం నాకు!" 1