ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. దాదాపు ప్రస్థానం (హిజ్రత్‌)కు 2 సంవత్సరాలకు ముందు. మక్కహ్ వారు తిరస్కరించినందుకు దైవప్రవక్త ('స'అస) ధర్మప్రచారం చేయటానికి 'తాయఫ్‌కు వెళ్తారు. కాని 'తాయఫ్‌ వాసులు అతనిని అవమానిస్తారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) అల్లాహ్‌ (సు.త.)ను ప్రార్థిస్తారు. దాదాపు 2 నెలల తరువాత యస్‌'రిబ్‌ (మదీనహ్) నుండి కొందరు వచ్చి ఇస్లాం స్వీకరిస్తారు. వారు దైనప్రవక్త ('స'అస)ను మదీనహ్ కు రమ్మని ఆహ్వానిస్తారు. 28 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 72:1

قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا ١

*(ఓ ప్రవక్తా!) ఇలాఅను: "నాకు ఈవిధంగా దివ్య సందేశం పంపబడింది; నిశ్చయంగా ఒక జిన్నాతుల సమూహం 1 – దీనిని (ఈ ఖుర్‌ ఆన్‌ను) విని – తమ జాతివారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్‌ఆన్‌) విన్నాము!


  • 72:2

يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا ٢

" 'అది సరైనమార్గం వైపునకు మార్గదర్శ కత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వ సించాము. 2 మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము.


  • 72:3

وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا ٣

" 'మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్య (సాహిబతున్‌) గా గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు.


  • 72:4

وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّـهِ شَطَطًا ٤

" 'మరియు నిశ్చయంగా మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్‌ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు.


  • 72:5

وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّـهِ كَذِبًا ٥

" 'మరియు వాస్తవానికి, మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్‌ను గురించి అబద్ధం పలకరని భావించేవారము.


  • 72:6

وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا ٦

" 'మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు. 3


  • 72:7

وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّـهُ أَحَدًا ٧

" 'మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్‌ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు.


  • 72:8

وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا ٨

" 'మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగిచూడటానికి ప్రయత్నించి నపుడు మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్నిజ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము. 4


  • 72:9

وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا ٩

" 'మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునే వారం 5 కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది. 6


  • 72:10

وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ١٠

" 'మరియు వాస్తవానికి, భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు,వారికి సరైనమార్గం చూపగోరు తున్నాడా అనే విషయం, మాకు అర్థం కావడంలేదు.


  • 72:11

وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا ١١

" 'మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుధ్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూవచ్చాము. 7


  • 72:12

وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّـهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا ١٢

" 'మరియు నిశ్చయంగా మేము అల్లాహ్‌ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము.


  • 72:13

وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا ١٣

" 'మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గ దర్శకత్వాన్ని(ఖుర్‌ఆన్‌ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు.


  • 72:14

وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَـٰئِكَ تَحَرَّوْا رَشَدًا ١٤

" 'మరియు నిశ్చయంగా మనలో కొందరు అల్లాహ్‌కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయ పరులు 8 (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్‌కు విధేయత (ఇస్లాం)ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు!' "


  • 72:15

وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا ١٥

మరియు అన్యాయపరులే (సత్యానికి దూరమైనవారే) నరకానికి ఇంధనమయ్యే వారు! 9


  • 72:16

وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا ١٦

ఒకవేళ వారు (సత్య-తిరస్కారులు) ఋజు మార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించేవారము.


  • 72:17

لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا ١٧

దానితో వారిని పరీక్షించటానికి! మరియు ఎవడైతే తన ప్రభువు ధ్యానం నుండి విముఖుడవుతాడో, ఆయన వానిని తీవ్రమైన శిక్షకు గురి చేస్తాడు.


  • 72:18

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّـهِ فَلَا تَدْعُوا مَعَ اللَّـهِ أَحَدًا ١٨

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్‌తో బాటు ఇతరు లెవ్వరినీ ప్రార్థించకండి.


  • 72:19

وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّـهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا ١٩

మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ యొక్క దాసుడు (ము'హమ్మద్‌) ఆయన (అల్లాహ్‌)ను ప్రార్థించటానికి నిలబడినప్పుడు, వారు (జిన్నా తులు) అతని చుట్టు దట్టంగా (అతని ఖుర్‌ఆన్‌ పఠనాన్ని వినటానికి) గుమిగూడుతారు. 10


  • 72:20

قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا ٢٠

వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను, నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను." 11


  • 72:21

قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا ٢١

వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నావశంలో లేదు."


  • 72:22

قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّـهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا ٢٢

ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నన్ను అల్లాహ్‌ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయనతప్ప మరొకరిఆశ్రయం కూడాలేదు;


  • 72:23

إِلَّا بَلَاغًا مِّنَ اللَّـهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّـهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ٢٣

"(నా పని) కేవలం అల్లాహ్‌ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే!" ఇక ఎవడైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో! అతడు నిశ్చయంగా, నరకాగ్నికి గురిఅవుతాడు; అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు.


  • 72:24

حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا ٢٤

చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం సంఖ్యా పరంగా తక్కువో వారికి తెలిసిపోతుంది. 12


  • 72:25

قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا ٢٥

ఇలా అను: "మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘకాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు."


  • 72:26

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ٢٦

ఆయనే అగోచర జ్ఞానం గలవాడు, కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు –


  • 72:27

إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ٢٧

తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప 13 ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షక భటులను నియమిస్తాడు.


  • 72:28

لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا ٢٨

వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించటానికి 14 మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్కపెట్టి ఉంచుతాడు.