అల్‌-హుమ'జహ్‌: The Slanderer, అపనిందలు, అపవాదాలు మోపేవాడు, ఇది దైవప్రవక్త ('స'అస) ప్రవక్తగా ఎన్నుకోబడిన దాదాపు 3 సంవత్సరాల తరువాత, సూరహ్‌ అల్‌-ఖియామహ్‌ (75) తరువాత మక్కహ్ లో అవతరింపజేయబడింది. 9 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 104:1

وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ١

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. 1


  • 104:2

الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ ٢

ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటిమాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో! 2


  • 104:3

يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ ٣

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు! 3


  • 104:4

كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ ٤

ఎంతమాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు. 4


  • 104:5

وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ ٥

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా? 5


  • 104:6

نَارُ اللَّـهِ الْمُوقَدَةُ ٦

అల్లాహ్‌, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;


  • 104:7

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ ٧

అది గుండెలదాకా చేరుకుంటుంది.


  • 104:8

إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ ٨

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది; 6


  • 104:9

فِي عَمَدٍ مُّمَدَّدَةٍ ٩

పొడుగాటి (అగ్ని) స్తంభాలవలె!