'హుజురాతున్ : గృహాలు, ఇండ్లు. ఈ సూరహ్‌ ఈ వరుసలో 3వది మరియు చివరిది. 9వ హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయబడింది. ఈ పేరు 4వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 18 ఆయతులు ఉన్నాయి. ఇందులో దైవప్రవక్త ('స'అస)కు ముస్లింలపై ఉన్న హక్కులు మరియు అతని పట్ల వారి మర్యాదలు మరియు ముస్లిం సహోదరుల పరస్పర హక్కులు మరియు తమ నాయకుని పట్ల ముస్లింల బాధ్యతలు బోధింపబడ్డాయి. 9వ హిజ్రీలో రాయబారాలు చాలా వస్తాయి. ఈ సూరహ్ వాటిని గురించి కూడా చెబుతోంది.

(1) 'తివాలు ముఫ'స్సల్‌ (49-79): ఈ సమూహపు సూరాహ్‌లలో ఇది మొదటిది అని కొందరంటారు. మరికొందరు, ఇవి సూరహ్‌ ఖాఫ్‌ (50) నుండి మొదలవుతాయి అంటారు. వీటిని ఫజ్ర్‌ నమా'జ్‌లో చదవటం మస్నూన్‌, ముస్త'హాబ్‌. (ఫ'త్హ్ అల్‌-ఖదీర్‌, ఇబ్నె-కసీ'ర్‌).

(2) అవ్‌సా'తు ముఫ'స్సల్‌ (80-91): వీటిని "జుహ్ర్‌ మరియు 'ఇషా నమాజులలో చదవటం, మస్నూన్‌, ముస్త'హబ్‌.

ఖి'సారు ముఫ'స్సల్‌ (92-114): వీటిని మగ్‌రిబ్‌ నమాజ్‌లో చదవటం, మస్నూన్‌, ముస్త'హబ్‌. (అయ్‌సర్‌ అత్తఫాసీర్‌).

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 49:1

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّـهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١

* ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. 1 అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.


  • 49:2

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ ٢

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దానివల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!


  • 49:3

إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِندَ رَسُولِ اللَّـهِ أُولَـٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّـهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ ٣

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో, అలాంటి వారి హృదయాలను అల్లాహ్‌ భయ-భక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.


  • 49:4

إِنَّ الَّذِينَ يُنَادُونَكَ مِن وَرَاءِ الْحُجُرَاتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ٤

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, ఎవరైతే, నిన్ను గృహాల బయటనుండి బిగ్గరగా (అరుస్తూ) పిలుస్తారో, వారిలో చాలామంది బుధ్ధిహీనులే. 2


  • 49:5

وَلَوْ أَنَّهُمْ صَبَرُوا حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٥

మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చేవరకు ఓపిక పట్టివుంటే, అది వారికే మేలై ఉండేది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.


  • 49:6

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا أَن تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَىٰ مَا فَعَلْتُمْ نَادِمِينَ ٦

ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్‌), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు – మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే – నిజానిజాలను విచారించి తెలుసుకోండి. 3


  • 49:7

وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّـهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَـٰكِنَّ اللَّـهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَـٰئِكَ هُمُ الرَّاشِدُونَ ٧

మరియు మీ మధ్య అల్లాహ్‌ యొక్క సందేశ హరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచు కోండి. ఒకవేళ అతను చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు, కానీ అల్లాహ్‌ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్య-తిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకర మైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గ దర్శకత్వం పొందినవారు.


  • 49:8

فَضْلًا مِّنَ اللَّـهِ وَنِعْمَةً ۚ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ٨

అది అల్లాహ్‌ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.


  • 49:9

وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّـهِ ۚ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٩

మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాలవారు పరస్పరం కలహించుకుంటే, వారి ద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారి లోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు, అల్లాహ్‌ ఆజ్ఞ వైపునకు మరలేవరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. 4 తరువాత వారు మరలివస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్ష పాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.


  • 49:10

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ١٠

వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. 5 మరియు మీరు కరుణించబడా లంటే అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి.


  • 49:11

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَسْخَرْ قَوْمٌ مِّن قَوْمٍ عَسَىٰ أَن يَكُونُوا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَاءٌ مِّن نِّسَاءٍ عَسَىٰ أَن يَكُنَّ خَيْرًا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوا أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا بِالْأَلْقَابِ ۖ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ١١

ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరికంటే శ్రేష్ఠులు కావచ్చు! 6 అదేవిధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తిపొడుచుకోకండి మరియు చెడ్డపేర్లతో పిలుచు కోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డపేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాపపడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు. 7


  • 49:12

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ ۖ وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ تَوَّابٌ رَّحِيمٌ ١٢

ఓ విశ్వాసులరా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసు కోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.


  • 49:13

يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّـهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ خَبِيرٌ ١٣

ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. 8 నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. (3/4)


  • 49:14

قَالَتِ الْأَعْرَابُ آمَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا وَلَـٰكِن قُولُوا أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْإِيمَانُ فِي قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا اللَّـهَ وَرَسُولَهُ لَا يَلِتْكُم مِّنْ أَعْمَالِكُمْ شَيْئًا ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٤

* ఎడారి వాసులు (బద్దూలు): "మేము విశ్వసించాము." అని అంటారు. (ఓ ము'హమ్మద్‌!) వారితో ఇలా అను: "మీరు ఇంకా విశ్వసించలేదు కావున: 'మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.' అని అనండి. ఎందు కంటే విశ్వాసం (ఈమాన్‌) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్‌ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథాకానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత."


  • 49:15

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّـهِ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ ١٥

వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికీ లోనుకాకుండా, అల్లాహ్‌ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.


  • 49:16

قُلْ أَتُعَلِّمُونَ اللَّـهَ بِدِينِكُمْ وَاللَّـهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١٦

వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్‌కు మీ ధర్మస్వీకారం గురించి తెలియ జేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌కు ప్రతివిషయం గురించి బాగా తెలుసు."


  • 49:17

يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا ۖ قُل لَّا تَمُنُّوا عَلَيَّ إِسْلَامَكُم ۖ بَلِ اللَّـهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَاكُمْ لِلْإِيمَانِ إِن كُنتُمْ صَادِقِينَ ١٧

(ఓ ము'హమ్మద్‌!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహ రిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్‌ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి."


  • 49:18

إِنَّ اللَّـهَ يَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّـهُ بَصِيرٌ بِمَا تَعْمَلُونَ ١٨

నిశ్చయంగా, అల్లాహ్‌! ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయా లన్నింటినీ ఎరుగును. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.