అల్‌-'గాషియహ్: The Overwhelming, హఠాత్తుగా ఆసన్మయ్యేది. క్రమ్ముకొనేది, పునరుత్థానదినం. దాని విపత్తు సర్వసృష్టిని క్రమ్ముకొంటుంది. ఇది ఆరంభ మక్కహ్ కాలపు సూరహ్‌. దైవప్రవక్త ('స'అస) జుము'అహ్‌ నమాజులలో సూరహ్‌ అల్‌-జుము'అహ్‌ (62) తరువాత దీనిని (88) పఠించేవారు (మువ'త్తా' ఇమామ్‌ మాలిక్‌). 26 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 88:1

هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ ١

హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరు త్థానదినపు) సమాచారం నీకు అందిందా?


  • 88:2

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ ٢

కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.


  • 88:3

عَامِلَةٌ نَّاصِبَةٌ ٣

(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి, 1


  • 88:4

تَصْلَىٰ نَارًا حَامِيَةً ٤

వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.


  • 88:5

تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ ٥

వారికి సలసలకాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.


  • 88:6

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ٦

వారికి చేదు ముళ్ళ గడ్డ ('దరీ'అ) తప్ప మరొక ఆహారం ఉండదు.


  • 88:7

لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ ٧

అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!


  • 88:8

وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ ٨

ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;


  • 88:9

لِّسَعْيِهَا رَاضِيَةٌ ٩

తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.


  • 88:10

فِي جَنَّةٍ عَالِيَةٍ ١٠

అత్యున్నతమైన స్వర్గవనంలో.


  • 88:11

لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً ١١

అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.


  • 88:12

فِيهَا عَيْنٌ جَارِيَةٌ ١٢

అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;


  • 88:13

فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ ١٣

అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి; 2


  • 88:14

وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ ١٤

మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;


  • 88:15

وَنَمَارِقُ مَصْفُوفَةٌ ١٥

మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;


  • 88:16

وَزَرَابِيُّ مَبْثُوثَةٌ ١٦

మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.


  • 88:17

أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ١٧

ఏమిటీ? వారు ఒంటెలవైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?


  • 88:18

وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ ١٨

మరియు ఆకాశంవైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?


  • 88:19

وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ ١٩

మరియు కొండలవైపుకు చూడరా? అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?


  • 88:20

وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ ٢٠

మరియు భూమివైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?


  • 88:21

فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ ٢١

కావున (ఓ ము'హమ్మద్‌!) నీవు హితోప దేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసేవాడవు మాత్రమే!


  • 88:22

لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ٢٢

నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.


  • 88:23

إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ٢٣

ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!


  • 88:24

فَيُعَذِّبُهُ اللَّـهُ الْعَذَابَ الْأَكْبَ ٢٤

అప్పుడు అతనికి అల్లాహ్‌ ఘోరశిక్ష విధిస్తాడు.


  • 88:25

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ ٢٥

నిశ్చయంగా, మావైపునకే వారి మరలింపు ఉంది;


  • 88:26

ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم ٢٦

ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!