అల్‌-ఫలఖ్‌: The Day Break, 'సుబ్‌'హున్‌, ఉదయం, ప్రాతఃకాలము, ప్రభాతం, వేకువజాము, తెల్లవారుజాము, అరుణోదయం. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. ఈ సూరహ్‌ (113) మరియు దీని తరువాత సూరహ్‌ అన్‌-నాస్‌ (114)ల యొక్క ఘనతలు ఎన్నో 'హదీస్‌'లలో పేర్కొనబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ఈ రాత్రి నాపై కొన్ని ఆయాతులు అవతరింపజేయబడ్డాయి. ఇటువంటి వాటిని నేను ఎన్నడూ వినలేదు." ఆ తరువాత అతను ఈ రెండు సూరహ్‌లు పఠించారు ('స. ముస్లిం, తిర్మిజీ'). దైవప్రవక్త ('స'అస) మానవుల మరియు జిన్నాతుల దిష్టి నుండి శరణు కోరేవారు. ఈ రెండు సూరహ్‌లు అవతరింపజేయబడిన తరువాత అతను వీటిని నిత్యం చదివే వారు, (తిర్మిజీ', అల్బానీ - ప్రమాణీకం నం. 2150). 'ఆయి'షహ్‌ (ర. 'అన్హా) కథనం: అతనికి ఏదైనా కష్టం కలిగితే, మ'ఊజ'తేన్‌ (అల్‌-ఫలఖ్‌, అన్‌-నాస్‌), సూరహ్‌లు చదివి తమ దేహంపై ఊదుకునే వారు. అతని కష్టం అధికమైతే, నేను ఈ సూరహ్‌లు చదివి నా చేతులను అతని శరీరం మీద పోనిచ్చే దానిని. (బు'ఖారీ, ముస్లిం).

దైవప్రవక్త ('స'అస)కు చేతబడి చేసినప్పుడు జిబ్రీల్‌ ('అ.స.) వచ్చి అతనితో ఈ రెండు సూరహ్‌లు చదవమన్నారు. దానితో, ఆ చేతబడి ప్రభావం దూరమయ్యింది ('స. బు'ఖారీ, ముస్లిం). దైవప్రవక్త ('స'అస) ప్రతిరోజూ రాత్రి నిద్రపోకముందు సూ. అల్‌-ఇ'ఖ్లా'స్‌ (112) మరియు ఈ రెండు సూరహ్‌లు చదివి తమ అరచేతులపై ఊది, వాటితో పూర్తి శరీరం మీద పూసుకునే వారు. మొదట నెత్తి, తరువాత ముఖం, ఆ తరువాత శరీరమంతా. ('స'హీ'హ్‌ బు'ఖారీ). 5 ఆయాతులున్నఈ సూరహ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 113:1

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ١

ఇలా అను: "నేను ఉదయకాలపు ప్రభువు అయిన (అల్లాహ్‌) శరణు వేడుకుంటున్నాను.


  • 113:2

مِن شَرِّ مَا خَلَقَ ٢

"ఆయన సృష్టించిన ప్రతిదాని కీడునుండి; 1


  • 113:3

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ٣

"మరియు చిమ్మ చీకటి కీడునుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 2


  • 113:4

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ٤

"మరియు ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి; 3


  • 113:5

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ٥

"మరియు అసూయపరుడి కీడునుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!" 4