అల్‌-బలద్‌: నగరం, పురం, పట్నం, The City, The Land. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. 20 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 90:1

لَا أُقْسِمُ بِهَـٰذَا الْبَلَدِ ١

* కాదు, నేను ఈ నగరం (మక్కహ్) సాక్షిగా (అంటున్నాను)!


  • 90:2

وَأَنتَ حِلٌّ بِهَـٰذَا الْبَلَدِ ٢

మరియు నీకు ఈ నగరంలో (మక్కహ్ లో) స్వేచ్ఛ ఉంది.


  • 90:3

وَوَالِدٍ وَمَا وَلَدَ ٣

మరియు తండ్రి (మూల పురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా! 1


  • 90:4

لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ ٤

వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమ జీవిగా పుట్టించాము.


  • 90:5

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ ٥

ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకోలేడని అతడు భావిస్తున్నాడా?


  • 90:6

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا ٦

అతడు: "నేను విపరీతధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు. 2


  • 90:7

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ ٧

ఏమిటి? తనను ఎవ్వడూ చూడటంలేదని అతడు భావిస్తున్నాడా? 3


  • 90:8

أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ ٨

ఏమిటి? మేము అతనికి రెండుకళ్ళు ఇవ్వలేదా?


  • 90:9

وَلِسَانًا وَشَفَتَيْنِ ٩

మరియు నాలుకను మరియు రెండు పెదవులను.


  • 90:10

وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ ١٠

మరియు అతనికి (మంచీ-చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము. 4


  • 90:11

فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ ١١

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వగమనానికి సాహసించలేదు! 5


  • 90:12

وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ ١٢

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?


  • 90:13

فَكُّ رَقَبَةٍ ١٣

అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం. 6


  • 90:14

أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ ١٤

లేదా! (స్వయంగా) ఆకలిగొని 7 ఉన్నరోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.


  • 90:15

يَتِيمًا ذَا مَقْرَبَةٍ ١٥

సమీప అనాథునికి గానీ;


  • 90:16

أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ ١٦

లేక, దిక్కులేని నిరుపేదకు గానీ! 8


  • 90:17

ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ ١٧

మరియు విశ్వసించి, సహనాన్ని బోధించే వారిలో! 9 మరియు కరుణను ఒకరికొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.


  • 90:18

أُولَـٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ ١٨

ఇలాంటి వారే కుడిపక్షం వారు. 10


  • 90:19

وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ ١٩

ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందిన వారు.


  • 90:20

عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ ٢٠

వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది. 11