అల్‌-'అలఖ్‌: The Germ Cell, The Clot, జీవకణం, పిండం, రక్తముద్ద, జలగ, దీని మరొక పేరు సూరహ్‌ అల్‌-ఇఖ్‌రా', చదువు, పఠించు. దీని మొదటి 5 ఆయత్‌లతో దివ్యజ్ఞాన (ఖుర్‌ఆన్‌) అవతరణ ప్రారంభమయ్యింది. ఇవి రమ'దాన్‌ నెల చివరి 10 రోజులలో ప్రస్థానానికి (హిజ్‌రత్‌కు) 13 సంవత్సరాలకు ముందు, (610వ క్రీస్తు శకం)లో దైవప్రవక్త ము'హమ్మద్‌ ('స'అస) 40 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, మక్కహ్ లోని నూర్‌ పర్వతం మీద ఉన్న, 'హిరా గుహలో అవతరింపజేయబడ్డాయి. మిగతా ఆయాత్‌లు (6-19), ఈ మొదటి వ'హీ అవతరింపజేయబడిన కొంతకాలం (ఫత్‌రతుల్‌ వ'హీ) తరువాత అవతరింపజేయబడ్డాయి. 19 ఆయాతులున్న ఈ సూరహ్‌ పేరు 2వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 96:1

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ١

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! 1


 • 96:2

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ٢

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు. 2


 • 96:3

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ٣

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.


 • 96:4

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ٤

ఆయన కలం ద్వారా నేర్పాడు 3


 • 96:5

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ٥

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.


 • 96:6

كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَ ٦

అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.


 • 96:7

أَن رَّآهُ اسْتَغْنَىٰ ٧

ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.


 • 96:8

إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَ ٨

నిశ్చయంగా, నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.


 • 96:9

أَرَأَيْتَ الَّذِي يَنْهَ ٩

నీవు నిరోధించే వ్యక్తిని చూశావా? 4


 • 96:10

عَبْدًا إِذَا صَلَّىٰ ١٠

నమా'జ్‌ చేసే (అల్లాహ్‌) దాసుణ్ణి? 5


 • 96:11

أَرَأَيْتَ إِن كَانَ عَلَى الْهُدَىٰ ١١

ఒకవేళ అతను (ము'హమ్మద్‌!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?


 • 96:12

أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ ١٢

ఇంకా, దైవభీతినిగురించి ఆదేశిస్తూ ఉంటే? 6


 • 96:13

أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ ١٣

ఒకవేళ (ఆ నిరోధించే) వాడు 7 సత్యాన్ని తిరస్కరించే వాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యే వాడు అయితే?


 • 96:14

أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّـهَ يَرَىٰ ١٤

వాస్తవానికి, అల్లాహ్‌ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?


 • 96:15

كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ ١٥

అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము. 8


 • 96:16

نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ ١٦

అది అబద్ధాలలో అపరాధాలలో మునిగి వున్న నుదురు!


 • 96:17

فَلْيَدْعُ نَادِيَهُ ١٧

అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!


 • 96:18

سَنَدْعُ الزَّبَانِيَةَ ١٨

మేము కూడా నరక దూతలను పిలుస్తాము!


 • 96:19

كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩ ١٩

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనకే (అల్లాహ్‌కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్‌) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు! (సజ్దా)