అష్‌-షర్‌'హ్‌: The Opening Forth, తెరవటం, విప్పటం. సూరహ్‌ అ'ద్‌-'దు'హా (93) తరువాతనే ఇది కూడా మక్కహ్ లో అవతరింపజేయబడింది. దీని ఇతర పేర్లు అల్‌-ఇన్‌షిరా'హ్‌ మరియు అలమ్‌ నష్ర'హ్‌. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ లో ఉంది. అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 94:1

أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ١

* (ఓ ము'హమ్మద్‌!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా? 1


  • 94:2

وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ ٢

మరియు మేము నీ భారాన్ని నీపై నుండి దించివేయలేదా?


  • 94:3

الَّذِي أَنقَضَ ظَهْرَكَ ٣

ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?


  • 94:4

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ٤

మరియు నీ పేరు ప్రతిష్ఠలను పైకెత్తలేదా? 2


  • 94:5

فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ٥

నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;


  • 94:6

إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ٦

నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. 3


  • 94:7

فَإِذَا فَرَغْتَ فَانصَبْ ٧

కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!


  • 94:8

وَإِلَىٰ رَبِّكَ فَارْغَب ٨

మరియు నీ ప్రభువునందే ధ్యానం నిలుపు.