ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూ'హ్, 'ఆద్ మరియు స'మూద్ జాతివారి మరియు వారి తరువాత వచ్చినవారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చి నపుడు, వారు తమ నోళ్ళలో తమ చేతులు పెట్టుకొని ఇలాఅన్నారు: ''నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్క రిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడివున్నాము.'' (3/4)
|