95:1

అంజూరం (అత్తి) మరియు జైతూన్‌ సాక్షిగా!

95:2

సీనాయ్‌ (తూర్‌) కొండ సాక్షిగా!

95:3

ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!

95:4

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.

95:5

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి-అధమమైన స్థితికి మార్చాము.

95:6

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారు తప్ప! ఎందుకంటే అలాంటివారికి అంతులేని ప్రతిఫలం ఉంది.

95:7

అయితే, (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫల దినాన్ని తిరస్కరిస్తున్నావు?

95:8

ఏమీ? అల్లాహ్‌ న్యాయాధిపతు లలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?


**********