32:1

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.

32:2

నిస్సంకోచంగా, ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) అవతరణ సర్వలోకాల ప్రభువు తరఫు నుండియే ఉంది.

32:3

ఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ము'హమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? అలాకాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

32:4

అల్లాహ్‌, ఆయనే ఆకాశాలను భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దిన ములలో (అయ్యామ్‌లలో) సృష్టించాడు ఆ తరువాత సింహాసనాన్ని ('అర్ష్‌ను) అధిష్టిం చాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్ష కుడుగానీ, సిపారసు చేసేవాడు గానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?

32:5

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరు వాత అంతా ఒకే దినమున, ఆయన వద్దకు పోయిచేరుతుంది; దాని (ఆ దినపు) పరి మాణం మీలెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.

32:6

ఆయన (అల్లాహ్‌)యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.

32:7

ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.

32:8

తరువాత అతని సంతతిని ఒక అధమ మైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.

32:9

ఆ తరువాత, అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు. మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలాతక్కువ!

32:10

మరియు వారు (అవిశ్వాసులు) అంటున్నారు: "ఏమీ? మేము నశించి, మట్టిలో కలిసిపోయినా, మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించ బడతామా?" అది కాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు. (5/8)

32:11

వారితో ఇలా అను: "మీపై నియమించ బడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింప బడతారు."

32:12

మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.

32:13

మరియు, మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము. కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది.

32:14

కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచిపోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

32:15

నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్‌) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో(సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొని యాడుతారు మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు;

32:16

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరంచేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడు కుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు.

32:17

కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువ నిచ్చే ఎటు వంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.

32:18

ఏమీ? విశ్వాసి అయినవాడు (దైవ భీతిలేని) అవిధేయునితో సమానుడా? (కాదు)! వారు సరిసమానులు కాలేరు.

32:19

ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలుచేస్తారో వారికి వారి కర్మలకు ఫలితంగా, వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసా లుంటాయి.

32:20

ఇక ఎవరైతే, విద్రోహ వైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయటపడటానికి ప్రయత్నించినపుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవి చూడండి."

32:21

మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపు తాము. బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!

32:22

మరియు తనప్రభువు సూచన (ఆయాత్‌) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం చేసి తీరుతాము.

32:23

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా)! నీవు అతనిని (ఇస్రా' రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు. మరియు మేము దానిని (తౌరాత్‌ను) ఇస్రా'యీల్‌ సంతతి వారికి మార్గదర్శినిగా చేశాము.

32:24

మరియు మేము (ఇస్రా'యీల్‌ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు – ఎంతవరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్‌ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో!

32:25

నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారిమధ్య తీర్పుచేస్తాడు.

32:26

ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశనం చేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగు తున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచన లున్నాయి. ఏమీ? వీరు వినటంలేదా?

32:27

ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా?

32:28

ఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్య వంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!"

32:29

ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు సత్య తిరస్కారులు విశ్వసించగోరినా, అది వారికి ఏవిధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు."

32:30

కావున నీవు వారితో విముఖుడవగు! మరియు వేచిఉండు, నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచిఉంటారు. (3/4)


**********