111:1

అబూలహబ్‌ రెండుచేతులూ నశించుగాక మరియు అతడుకూడా నశించిపోవు గాక!

111:2

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికిరావు!

111:3

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!

111:4

మరియు అతడి భార్యకూడా! కట్టెలు మోసే (చాడీలుచెప్పి కలహాలురేకెత్తించే) స్త్రీ!

111:5

ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్‌) ఉంటుంది.


**********