105:1

ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?

105:2

ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?

105:3

మరియు ఆయన వారిపైకి పక్షులగుంపులను పంపాడు;

105:4

అవి (ఆపక్షులు) వారి మీద మట్టితోచేసి కాల్చిన కంకరరాళ్ళను (సిజ్జీల్‌) విసురుతూ పోయాయి;

105:5

ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చివేశాడు.


**********