21:1

మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.

21:2

(కావున) వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు.

21:3

వారి హృదయాలు వినోదక్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్ర దింపులు చేసుకొని (ఇలా అంటారు): “ఏమి? ఇతను (ము’హమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూవుండి కూడా, ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోతారా?”

21:4

(ము’హమ్మద్) ఇలా అన్నాడు: “నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలో ను పలుకబడే ప్రతిమాట తెలుసు. మరియు అయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

21:5

అలాకాదు! వారన్నారు: “ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!”

21:6

మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులుకూడా విశ్వసించి ఉండ లేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా?

21:7

మరియు నీకు పూర్వం కూడా (ఓ ము’హమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వ’హీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథ ప్రజలను) అడగండి.

21:8

మరియు మేము వారికి(ఆ ప్రవక్తలకు) ఆహరం తినే అవసరంలేని శరీరాలను ఇవ్వ లేదు. మరియు వారు చిరంజివులు కూడా కాలేదు.

21:9

ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తిచేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము.

21:10

(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింప జేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

21:11

మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము!

21:12

మా శిక్ష (రావటం) తెలుసు కున్నప్పడు వారు దానినుండి పారిపోవ టానికి ప్రయత్నించేవారు.

21:13

(అప్పడు వారితో ఇలా చెప్పబడింది): “పారిపోకండి! మరలిరండి – మీరు అనుభ విస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళవైపుకు – ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!”

21:14

వారన్నారు: “అయ్యె మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము.”

21:15

ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్నివలే, చేసినంతవరకు వారి అరుపు ఆగలేదు.

21:16

మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు.

21:17

ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచు కుంటే, మేము మా వద్ద ఉన్నదానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలాచేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే!

21:18

అలాకాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగులగొడు తుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు.

21:19

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ అయనకు చెందినదే. మరియు అయనకు దగ్గరగా ఉన్న వారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.

21:20

వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీత చూపరు.

21:21

ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చని పోయిన వారిని) మరల బ్రతికించి లేప గలవా?

21:22

వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్యదైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాస నానికి (’అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.

21:23

తాను చేసే దానిని గురించి అయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.

21:24

ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్యదైవాలను నియమించుకున్నారా? వారితో అను: “మీ నిదర్శనాన్ని తీసుకు రండి.” ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వికులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహిచలేదు, కావున వారు విముఖులై పోతున్నారు.

21:25

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరోక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధిం చండి.” అని దివ్యజ్ఞానం (వ’హీ) ఇచ్చి పంపాము.

21:26

వారంటున్నారు: “అనంత కరుణా మయునికి సంతానముంది!” అని. అయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతా నంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవ నీయులైన (అయన) దాసులు మాత్రమే!

21:27

వారు అయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) అయన అజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.

21:28

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ మరియు పరోక్షంగా (గోప్యంగా) ఉన్నదీ, అంతా తేలుసు. వారు, అయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, అయన భీతివలన భయకంపితులై ఉంటారు. (1/8)

21:29

వారిలో (దైవదూతలలో) ఎవరైనా: “నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని.” అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము. మేము దుర్మార్గులను ఇదేవిధంగా శిక్షిస్తాము.

21:30

ఏమి ? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా ) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా?

21:31

మరియు భూమి వారితోపాటు కదల కుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వ తాలను (మేకులవలే) నాటాము. మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గలను కూడా ఏర్పాటు చేశాము.

21:32

మరియు మేము ఆకాశాన్ని సురక్షిత మైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.

21:33

మరియు రేయింబవళ్ళను మరియు సూర్య చంద్రులను సృష్టించినవాడు అయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి.

21:34

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవి తాన్ని ప్రసాదించలేదు. ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా?

21:35

ప్రతిప్రాణి మృత్యువు(చావు)ను చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురిచేసి పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.

21:36

మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా నీతో పరిహసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు) : “ఏమీ? మీ ఆరాధ్యదైవలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?” ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చి నప్పుడు! వారే, సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.

21:37

మానవుడు ఆత్రగాడుగా (తోందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.

21:38

మరియు వారంటున్నారు: “మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెది రింపు) ఎప్పుడు నెరవేరనున్నది.

21:39

ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్నినుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహయం కూడా లభించదు.

21:40

వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవరపెడుతుంది. వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధికూడా ఇవ్వబడదు.

21:41

మరియు (ఓ ము’హమ్మద్!) వాస్త వానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది.

21:42

ఇలాఅను: “రేయింబవళ్ళ మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?” అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు.

21:43

లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడ టానికి మేము తప్ప వేరేదైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు.

21:44

అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖ సంతో షాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని, దాని అన్ని వైపులనుండి తగ్గిస్తున్నామని? అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?

21:45

(ఓ ము’హమ్మద్!) వారితో ఇలా అను: “నేను కేవలం దివ్యజ్ఞానం (వ’హీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.” కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా!

21:46

మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే, వారు: “ అయ్యె మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గు లముగా ఉండేవారం.” అని అంటారు.

21:47

మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయంజరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మఉన్నా మేము దానిని ముందుకుతెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!

21:48

మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటు రాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతిగల వారికి ఒక హితబోధను.

21:49

వారికొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!

21:50

మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ ఆన్)ను మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా? (1/4)

21:51

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.

21:52

అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: “మీరు భక్తితో ఆరాధిస్తూన్న ఈ విగ్రహలు ఏమిటి?”

21:53

వారన్నారు: “మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము.”

21:54

(ఇబ్రాహీమ్) అన్నాడు: “వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రితాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడిఉన్నారు.”

21:55

వారన్నారు: “ఏమీ? నీవు మా వద్దకు ఏదైన సత్యాని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహసమాడుతున్నావా?”

21:56

(ఇబ్రాహీమ్) అన్నాడు: “అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్య మిస్తున్నాను.

21:57

“మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహలకువిరుద్థంగా తప్పక యుక్తి పన్నుతాను.”

21:58

తరువాత అతను ఒక పెద్దదానిని (విగ్రహన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని!

21:59

వారన్నారు: “మా ఆరాధ్య దైవాలతో ఈవిధంగా ప్రవర్తించినవాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు.”

21:60

(కొందరు) ఇలా అన్నారు; “ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము.”

21:61

(ఇతరులు) అన్నారు: “అయితే, అతనిని ప్రజల కళ్ళముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమె!”

21:62

(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: “ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు?”

21:63

(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: “కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి!”

21:64

వారు తమలోతాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: “నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు!”

21:65

కాని, తరువాత వారి బుద్థి తల క్రిందులై వారు ఇలా అన్నారు: “వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!”

21:66

(ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: “అలా అయితే! మీరు అల్లాహ్ నువదలి, మీ కెలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?

21:67

“ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయెగించరా?”

21:68

వారన్నారు: “మీరేమైనా చేయ దలుచు కుంటే! ఇతనిని కాల్చివేయండి, మీ ఆరాధ్య దైవాలకు తోడ్పడండి.”

21:69

మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: “ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!”

21:70

మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తలపెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము.

21:71

మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూ’త్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము.

21:72

మరియు అతనికి (ఇబ్రహీమ్)కు ఇస్ హ’ఖ్ మరియు య’అఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము. మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.

21:73

మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా అజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై – సత్కార్యాలుచేయాలని, నమా’జ్ స్థాపిచాలని, విధిదానం (’జకాత్) ఇవ్వాలని – దివ్యజ్ఞానం (వ’హీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధిచే వారు.

21:74

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూ’త్ కు వివేకాన్ని మరియు జ్ఞాన్నాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్నవారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.

21:75

మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింపజేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు.

21:76

మరియు (జ్ఞాపకంచేసుకోండి) నూ’హ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగిక రించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.

21:77

మరియు మా సూచనలను అబద్థాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారి నందరినీ ముంచివేశాము.

21:78

మరియు దావూదు మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పుచేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి) : ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్త వానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.

21:79

అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము.

21:80

మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారుచేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా?

21:81

మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని అజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమిమీద వీచేది. మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

21:82

మరియు ’షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము. (3/8)

21:83

మరియు (జ్ఞాపకంచేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): “నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణా మయులలో కెల్లా గొప్ప కరుణా మయుడవు!”

21:84

అప్పడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము.

21:85

మరియు (జ్ఞాపకం చేసుకోండి), ఇస్మా’యీల్, ఇద్రీస్ మరియు జు’ల్కిఫ్ల్, వీరందరు కూడా సహనశీలురైన వారే!

21:86

మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా, వారందరూ సద్వర్తనులు.

21:87

మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేప వాడు (యూనుస్) – ఉద్రేకంతో వెళ్ళిపోతూ – మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధ కారాలలో చిక్కుకొని పోయి నప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: “వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను.”

21:88

అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము. మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము.

21:89

మరియు (జ్ఞాపకం చేసుకోండి), ’జకరియ్యా తన ప్రభువును వేడుకున్న ప్పుడు ఇలాప్రార్థించాడు: “ఓ నా ప్రభూ! నన్ను ఒంటరి వానిగా (సంతాన హీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!”

21:90

అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీక రించి, అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యెగ్యురాలుగా చేసి, అతనికి య’హ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటిపడే వారు. మరియు శ్రద్థతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించే వారు. మరియు మా సమక్షంలో వినమృలై ఉండేవారు.

21:91

మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూ’హ్) ఊది, అమెను మరియు అమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.

21:92

నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.

21:93

కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది.

21:94

సత్కార్యాలు చేసేవాడు విశ్వసించే వాడై ఉంటే, అతనిశ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.

21:95

మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి)పై, వారు (ఆ నగరవాసులు) మరలిరావటం నిషేధించబడింది.

21:96

ఎంతవరకైతే యఅ‘జూజ్ మరియు మఅ‘జూజ్ లు వదలిపెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో!

21:97

మరియు సత్యవాగ్దనం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్య-తిరస్కారుల కళ్లు విచ్చుకుపోయి: “అయె మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీనినుండి అశ్రద్థకు గురి అయ్యాము. కాదుకాదు! మేము దుర్మార్గులముగా ఉండేవారము.” అని అంటారు.

21:98

(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): “నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారూ, నరకాగ్నికి ఇంధన మవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.

21:99

ఒకవేళ ఇవన్నీ ఆరాధ్యదైవాలే అయివుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!”

21:100

అందులో వారు (దుఃఖంచేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.

21:101

నిశ్చయంగా ఎవరికొరకైతే, మా తరపు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు.

21:102

వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు.

21:103

ఆ గొప్ప భీతి కూడా వారికి దుఖం కలిగించదు మరియు దైవదుతలు వారిని ఆహ్వనిస్తూ వచ్చి: “మీకు వాగ్దనం చేయ బడిన మీ దినం ఇదే! అని అంటారు.

21:104

(జ్ఞాపముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టి నట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మెుదట ఆరంభించామో! ఆదేవిధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దనం. మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.

21:105

వాస్తవానికి మేము ’జబూర్ లో – మా హితబోధ తరువాత – నిశ్చయంగా, ఈ భూమికి సద్వర్తునులైన నాదాసులు వారసు లవుతారని వ్రాసి ఉన్నాము.

21:106

నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది.

21:107

మరియు మేము నిన్ను(ఓ ప్రవక్త!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.

21:108

(ఓ ము’హమ్మద్) ఇలా అను: “నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వ’హీ) అవతరిపజేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

21:109

ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: “నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు.”

21:110

నిశ్చయంగా, అయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్తపరిచేది మరియు దాచేది అంతా తెలుసు.

21:111

మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభ వించటానికి ఇవ్వబడీన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు!

21:112

అతను (ము’హమ్మద్) ఇలా అన్నాడు: “ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పుచేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహయమే కోరబడుతుంది!” (1/2)


**********