మరియు మేము మానవునికి తన తల్లి దండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తనగర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్పై నెలలు అవుతాయి. చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయ టానికి నాకు సద్బుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."
|